సాయి కుమార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఆది. మొదటి సినిమా 'ప్రేమ కావాలి' సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. తర్వాత 'లవ్లీ' సినిమా కూడా ఓకే అనిపించింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆది హీరోగా నిలబడిపోతాడని అంతా అనుకున్నారు. కానీ తర్వాత ఆడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఒక్క హిట్టు కాదు కదా కనీసం యావరేజ్ కూడా దక్కడం లేదు. మొన్న వచ్చిన 'బుర్రకధ' పరిస్థితి కూడా అంతే. కనీసం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.
ఇప్పుడు మరో కొత్త సినిమాతో రెడీ అయ్యాడు. అదే జోడి. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. సింపుల్ గా ఓ లవ్ స్టోరీ ఇది. టీజర్ మరీ అంత గొప్పగా లేదు. కానీ జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ చాలా క్యూట్ గా కనిపించింది. ఆమె మంచి నటి. ఒక సినిమా ఒప్పుకుందంటే అందులో ఏదో విషయం ఉంటుందనే నమ్మకం. ఆ రకంగా ఈ సినిమాకి ఆమె ప్లస్. మరి చూడాలి ఆది ఈసారైన ఓ హిట్ కొడతాడేమో.