లిప్ లాక్ అంటే... స‌మంత ఒప్పుకుంటుందా?

మరిన్ని వార్తలు

వెండి తెర‌పై లిప్ లాక్ సన్నివేశాలంటే ఇప్పుడు చాలా కామ‌న్ అయిపోయింది. ప్ర‌తీ సినిమాలోనూ లిప్ లాక్ క‌నిపిస్తూనే ఉంది. అగ్ర హీరోయిన్లు సైతం.. ఇలాంటి సీన్లు చేయ‌డానికి ఏమాత్రం అభ్యంత‌రం చెప్ప‌డం లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌తీ సినిమాలోనూ... ఇలాంటి హాట్ సీన్ ఒక‌టి ఉండాల్సిందే. ప్ర‌స్తుతం తాను `ఖుషి` అనే సినిమా చేస్తున్నాడు. స‌మంత హీరోయిన్‌. ఇదో ల‌వ్ స్టోరీ. ప్రేమ‌క‌థ అన్నాక‌.. ముద్దులు, హ‌గ్గులూ లేకుండా ఎలా ఉంటాయి? ఈ సినిమాలోనూ కొన్ని లిప్ లాక్ స‌న్నివేశాలు ఉన్నాయ‌ట‌. వాటిలో న‌టించ‌డానికి స‌మంత ఒప్పుకుంటుందా? లేదా? అనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందిప్పుడు.

 

స‌మంత ముందు నుంచీ లిప్ లాక్ ల‌కు దూరం. `ఏ మాయ చేశావె`లో ఒక‌ట్రెండు ముద్దులు ఉంటాయి గానీ, అవి డీప్ లిప్ లాకులు కావు. రంగ‌స్థ‌లంలో రామ్ చ‌ర‌ణ్‌తో ఓ సీన్ ఉంది. కానీ అది కూడా జిమ్మిక్కే అని ఆ త‌ర‌వాత స‌మంత చెప్పింది. ఇప్పుడు కూడా గ్రాఫిక్స్ ని అడ్డుపెట్టుకొని ఈ సీన్లు చేయొచ్చు. కాక‌పోతే.. స‌మంత‌ని రియ‌ల్ లిప్ లాక్ కోసం ఒప్పించాల‌న్న‌ది ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం. దానికి స‌మంత ఓకే అంటుందా? లేదా? అనేది చూడాలి. పెళ్ల‌య్యాక కాస్త బోల్డ్ గా క‌నిపించ‌డానికి స‌మంత రెడీ అంటోంది. మొన్నామ‌ధ్య పుష్ప‌లో ఐటెమ్ సాంగ్ కూడా చేసింది. అందుకే... ఇప్పుడు లిప్ లాక్‌ల‌కు ప‌చ్చ‌జెండా ఊపుతుంద‌ని అనుకుంటున్నారు. స‌మంత ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో, ఏమో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS