'వినయ విధేయ రామ' ట్రిపుల్‌ ధమాకా.!

By iQlikMovies - December 08, 2018 - 15:43 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తాజా చిత్రం 'వినయ విధేయ రామ' షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇక షూటింగ్‌ పూర్తయిపోతే నెక్స్ట్‌ కార్యక్రమం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌. చరణ్‌ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ జరగనంత ఘనంగా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోందట. అన్నింటికీ మించి ఈ వేడుకకు బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారట. అదేంటంటే ఎన్టీఆర్‌, చరణ్‌, రాజమౌళి ఈ ముగ్గురూ కలిసి ఈ వేదికపై మెరవనున్నారట. నిజంగా ఇది ట్రిపుల్‌ ధమాకానే కదా. 

 

'ఆర్‌ఆర్‌ఆర్‌'కి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ కొన్ని ఈ సందర్భంగా రాజమౌళి నోటి వెంట వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. ఈ సినిమా చిత్రీకరణ పూర్తై ఇంకా ఈ ముగ్గురూ కలిసి ఒకే వేదికపై కనిపించాలంటే చాలా టైమే పడుతుంది. కానీ అభిమానులను అంతవరకూ వెయిట్‌ చేయించకూడదనుకున్నారు కాబోలు. ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ త్రయం ముందే ఫ్యాన్స్‌కి ట్రిపుల్‌ కిక్‌ ఇచ్చేస్తున్నారన్న మాట. ఆల్రెడీ ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్‌ షెడ్యూల్‌కి త్వరలోనే రెడీ కానుంది.

 

ఈ లోగా చరణ్‌ 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో కలిసి సందడి చేయనున్నారన్న న్యూస్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఒకవేళ ఇది నిజమైతే ఇరు హీరోల ఫ్యాన్స్‌కీ పట్టరాని ఆనందమే. సంక్రాంతి పండగ ముందే వచ్చేసినట్లే. అతి త్వరలోనే ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ని బోయపాటి అండ్‌ కో ప్రకటించనున్నారట. స్కెచ్‌ మామూలుగా లేదు కదా. అన్నట్లు ఈ రెండు సినిమాలకు ప్రొడ్యూసర్‌ డివివి దానయ్యే కావడం ఈ స్కెచ్‌కి మరో ముఖ్య కారణం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS