'నాన్న తర్వాత అంతగా నన్ను మోటివేట్ చేసిన వ్యక్తి చిరంజీవి. నన్ను సరైన దరిలో నడిపించిన చిరంజీవి అన్నయ్యను జీవితాంతం మర్చిపోను' అని 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవిపై ఎంతో అభిమానాన్ని చాటుకున్నాడు దర్శకుడు వినాయక్. చిరంజీవితో 'ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150' వంటి విజయవంతమైన చిత్రాల్ని రూపొందించిన వినాయక్, తాజాగా చిరంజీవి కోసం ఓ కొత్త కథను రెడీ చేసుకుంటున్నాడట. ఈ విషయాన్ని వినాయక్ స్వయంగా చెప్పాడు. చిరంజీవితో రెండూ రీమేక్ చిత్రాలే చేసిన తాను స్ట్రెయిట్‌గా ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమాపై స్పష్టత వస్తుందని వినాయక్ అన్నాడు. అయితే 'ఠాగూర్' తర్వాత చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' సినిమా చేయడానికి వినాయక్ చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. వినాయక్ ఎదురుచూపులకు ఓ సారి షాక్ కూడా తగిలింది. వినాయక్ కాకుండా పూరి జగన్నాథ్ పేరుని చిరంజీవి పరిశీలించినా చివరకు వినాయక్ ఆ ఛాన్స్ దక్కించుకోవడంతో 'ఖైదీ నెంబర్ 150' సినిమా పట్టాలెక్కింది. ఏదేమైనప్పటికీ తనకు రెండు హిట్స్ ఇచ్చిన తన వీరాభిమాని వినాయక్‌తో ఈసారి చిరంజీవి చేస్తే అది మరో సంచలనం కాకుండా ఉండదు.