'విరాటపర్వం' ఎట్‌ గ్రాండ్‌ లాంఛింగ్‌!

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడు రానా దగ్గుబాటి హీరోగా 'విరాటపర్వం' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. లాంఛనంగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం చేశారు. వెంకటేష్‌ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో సుధాకర్‌ చెరుకూరితో కలిసి సురేష్‌బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎమర్జెన్సీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. యదార్ధ సంఘటనల ఆధారంగా రాసుకున్న కొన్ని సీన్లను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్‌ వేణు ఉడుగుల. గతంలో 'నీదీ నాదీ ఒకే కథ' సినిమాతో ఆకట్టుకున్నాడీ డైరెక్టర్‌ వేణు ఉడుగుల.

 

ఎమోషన్స్‌ని కనెక్ట్‌ చేయడంలో తొలి సినిమాకే మంచి మార్కులు కొట్టేశాడు వేణు ఉడుగుల. ఈ సినిమాతో మరోసారి అదే ప్రయత్నం చేయబోతున్నాడు. చాలా హృద్యంగా ఈ సినిమాని రూపొందించనున్నాడట. సీనియర్‌ నటి ప్రియమణి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కథని నమ్మి సినిమాలను ఒప్పుకునే రానాకి ఈ సినిమా మరో కెరీర్‌ బెస్ట్‌ అవుతుందంటున్నారు. ప్రస్తుతం రానా 'హాథీ మేరీ సాథీ', '1947' తదితర చిత్రాల్లో నటిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS