ఇస్మార్ట్‌ టూ రొమాంటిక్‌!

మరిన్ని వార్తలు

ఇస్మార్ట్‌ శంకర్‌ మాస్‌, ఊరమాస్‌ మాత్రమే కాదండోయ్‌. పక్కా రొమాంటిక్‌ గై. అందుకే ఇద్దరు భామలతో మనోడు ఫుల్‌గా రొమాన్స్‌ చేస్తున్నాడు. రామ్‌ పోతినేని హీరోగా, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న 'ఇస్మార్ట శంకర్‌' షూటింగ్‌ ప్రస్తుతం మాల్దీవుల్లో జరుగుతోంది. ఇక్కడ ఓ రొమాంటిక్‌ సాంగ్‌ షూట్‌ కోసం ఇస్మార్ట్‌ టీమ్‌ అంతా అక్కడ పాగా వేసింది. నిధి అగర్వాల్‌, రామ్‌ పోతినేని మధ్య ఈ సాంగ్‌ చిత్రీకరణ జరుగుతోంది. పక్కా మసాలా సాంగ్‌గా ఈ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ తరహా సాంగ్స్‌ని చిత్రీకరించడంలో పూరీ తనదైన మార్కు వేయించుకున్నాడు.

 

'ఇడియట్‌' సినిమాలో రవితేజ - రక్షిత మధ్య 'ఈ రోజే తెలిసింది.. నీలో దాగిన ప్రేమ..' అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ తరహాలో ఈ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమాలో హీరో రవితేజను మించిన మాస్‌ కాబట్టి ఇంకా మాస్‌ మసాలా రేంజ్‌లోనే ఈ సాంగ్‌ విజువల్స్‌ ఉండబోతున్నాయట. రామ్‌, నిధి అగర్వాల్‌ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉండబోతోందట. భాస్కరభట్ల రచించిన ఈ పాటకు, మణిశర్మ మ్యూజిక్‌ అందించారు. పూరీ కనెక్స్ట్‌ బ్యానర్‌లో పూరీ, ఛార్మి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూలై 12న 'ఇస్మార్ట్‌ శంకర్‌'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS