స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌ కానున్న 'విరాట‌ప‌ర్వం'

By iQlikMovies - January 13, 2021 - 18:27 PM IST

మరిన్ని వార్తలు

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా 'విరాట‌ప‌ర్వం'. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్" అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని పురస్క‌రించుకొని ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చిత్ర బృందం బుధ‌వారం స‌రికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది.

 

ఈ పోస్ట‌ర్‌లో ఆలివ్ గ్రీన్ డ్ర‌స్‌లో న‌క్స‌లైట్‌గా రానా క‌నిపిస్తుండ‌గా, ఆయ‌న చేతిని ప‌ట్టుకొని సంప్ర‌దాయ తెలుగింటి అమ్మాయిలా లంగా వోణీ డ్ర‌స్సులో సాయిప‌ల్ల‌వి క‌నిపిస్తున్నారు. అడ‌విలో న‌డుచుకుంటూ వెళ్తున్న‌ట్లున్న ఆ ఇద్ద‌రూ హాయిగా న‌వ్వుతున్నారు. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో 'విరాట‌ప‌ర్వం'ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు ఆ పోస్ట‌ర్ ద్వారా నిర్మాత‌లు తెలియ‌జేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కు, రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

 

నిజానికి ఇవ‌న్నీ 'విరాట‌ప‌ర్వం'పై అంచ‌నాల‌ను పెంచి, ఆడియెన్స్‌లో, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. మిగ‌తా ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS