మాస్టర్‌ మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

 

నటీనటులు: విజయ్,విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్, ఆండ్రియా, అర్జున్ దాస్ తదితరులు 
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్ 
నిర్మాత‌లు : జేవియర్ బ్రిటో 
సంగీతం : అనిరుద్ 
సినిమాటోగ్రఫర్ : సత్యన్ సూర్యన్ 
ఎడిటర్: ఫిలోమన్ రాజ్ 


రేటింగ్: 2.5/5


విజయ్ సినిమాలు గత కొన్నేళ్ళుగా తెలుగు ప్రేక్షకులని పలకరిస్తున్నాయి. ప్రతి సినిమాని డబ్ చేసి ఇక్కడ వదులుతున్నారు. రజనీ, కమల్, సూర్య, కార్తిల వరుసలో ఇక్కడ స్థానం సంపాయించాలనే గట్టి పట్టుదలతో వున్నాడు విజయ్. ఈ పండక్కి ఆయన నుంచి మరో సినిమా వచ్చింది. అదే మాస్టర్. ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్ సేతుపతి, విజయ్ కి విలన్ కావడం వెరైటీ అనిపించింది. దానికి తోడు ‘ఖైదీ’తో తెలుగులో కూడా క్రేజ్‌ సంపాదించిన లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకుడు కావడం ఇంకా ఆసక్తిని పెంచింది. మరి ఇన్ని అంచనాల మధ్య వచ్చినీ మాస్టర్ ఎలా ఉన్నాడో తెలుసుకుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే. 


* కథ‌:


జేడీ (విజయ్) ఒక కాలేజీలో ప్రొఫెసర్. స్టూడెంట్స్ లో మంచి ఫాలోయింగ్ వుంటుంది. జేడీ కారణంగా స్టూడెంట్ ఎలక్షన్స్  జరుగుతాయి. అయితే ఈ ఎన్నికలు యాజమాన్యంకు ఇష్టం వుండదు. ఏమైనా అల్లర్లు జరిగితే కాలేజీ వదిలి వెళ్ళిపోవాలని కండీషన్ పెడతాయి. ఎన్నికలు సజావుగానే జరుగుతాయి కానీ ఫలితాలు తర్వాత గొడవ మొదలౌతుంది. దీంతో జేడీ బాల నేరస్థుల స్టేట్ అబ్జర్వరేషన్‌ హోమ్‌కి మాస్టర్‌గా వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ జేడీకి సవాళ్ళు ఎదురౌతాయి. ఆ హోమ్‌ని అడ్డుపెట్టుకుని భవాని (విజయ్ సేతుపతి) అరాచకాలకు పాల్పడుతూ ఉంటాడు. మరి భవానిని  జేడీ ఎలా ఢీకొట్టాడు. అసలు భవాని ఎవరు? అతడి కధ ఏమిటి ? చివరికి భావానిని జేడీ ఎలా అడ్డుకున్నాడనేది తెరపై చూడాలి.


* విశ్లేష‌ణ‌


విజయ్ సినిమా అంటేనే హీరోయిజం చుట్టూ తిరుగుతుంది. అయితే ఖైదీ లాంటి అవుట్ అఫ్ ది బాక్స్ కధతో మెప్పించిన లోకేష్ కనకరాజు మాస్టర్ కి దర్శకుడు కావడంతో తప్పకుండా కొత్తదనం ఏదో ఆశిస్తారు. మాస్టర్ లో ఆ ప్రయత్నం కొంత వరకూ జరిగింది. అయితే కొంత ప్రయాణం జరిగిన తర్వాత మళ్ళీ విజయ్ స్కేల్ లోనే మాస్టర్ ని నడిపించేశాడు దర్శకుడు. 
సినిమాకి మంచి ఆరంభం దొరికింది.  కాలేజీ సీన్లు అదిరిపోతాయి. ప్రొఫెసర్ గా విజయ్ చేసే స్టయిలీష్ యాక్షన్, మేనరిజమ్స్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తాయి. విజయ్ సేతుపతి పాత్రని పరిచయం చేయడం, ఆ క్రమంలో వచ్చే సన్నివేషాలు కూడా ఆకట్టుకుంటాయి. ఒక దశలో విజయ్ సేతుపతి పాత్రే హైలెట్ అన్నట్టు సాగుతుంది. మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా కుదిరింది. విరామం వరకూ పెద్ద విఘ్నాలు లేకుండా గడిచిపోతుంది. 


అయితే రెండో సగం వచ్చేసరికి సమస్య వచ్చిపడింది. మొదటి సగంలో ప్రధాన ఆక‌ర్షణ‌ నిలిచిన విజ‌య్ సేతుప‌తి పాత్రని సడన్ గా తగ్గించేసిన ఫీలింగ్ కొడుతుంది. పైగా హీరోయిజం కోసం తాపత్రయం కనిపిస్తుంది తప్పితే కధ ముందుకు సాగదు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ చాలా లాగ్ అనిపిస్తాయి. నిడివి పరంగా తీసుకుంటే చాలా పెద్ద సినిమా ఇది.  థియేటర్ లో విజయ్ కనిపిస్తే చాలు అనుకున్న డై హార్డ్ ఫ్యాన్స్ కి ఓకే కానీ సినిమాని ఎక్స్ పీరియన్స్ చేయాలనీ థియేటర్ లో వచ్చే ఆడియన్స్ కి మాత్రం కొన్ని చోట్ల కొంత విసుగనిస్తుంది. తొలిసగంలో కొంత వైవిధ్యం చూపిన దర్శకుడు .. రెండో సగానికి వచ్చేసరికి మళ్ళీ రొటీన్ ఫార్ముల లోకి వెళ్ళిపోయాడు. హీరో కి ఎదురైన సవాళ్ళు తేలిపోతుంటాయి. మొదటి సగంలో బలంగా రాసుకున్న విలన్ పాత్ర తర్వాత చాలా తేలిగ్గా వదిలేశారనే బావన కలుగుతుంది. అయితే కైమాక్స్ వచ్చేసరికి జేడీ-భావానిల మధ్య జరిగే యాక్షన్ సీన్ చక్కగా చిత్రీకరించాడు దర్శకుడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషితో థియేటర్ నుంచి బయటకు తీసుకురాగలిగాడు. 


* న‌టీన‌టులు


విజయ్ సినిమా ఇది. ఆయన్ని నుండి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్నీ వున్నాయి. విజయ్ యాక్షన్, స్టయిలు, డ్యాన్స్ మేనరిజమ్స్ .. ఇలా బావున్నాయి. ఫ్యాన్స్ ని ఎక్కడా నిరాశపరచలేదు.  విజయ్ సేతుపతి మరోసారి అదరగొట్టాడు. విజయ్ కంటే బలమైన పాత్ర దక్కింది. ఒక దశలో ఇది విజయ్ సేతుపతి సినిమానా అనిపిస్తుంది. భావానిగా విజయ్ సేతుపతి పెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. హీరోయిన్ మాళవిక మోహన్  అందంగా కనిపించింది. నటన ఇంకా మెరుగుపడాలి. పైగా కధకు ఆమె పాత్ర అంతగా సింక్ కాలేదు. మిగతా నటీనటులు పరిధిమేర చేశారు.


* సాంకేతికత‌


టెక్నికల్ గా తీసుకుంటే సినిమా ఉన్నంతగా వుంది. మంచి ఫోటోగ్రఫీ కుదిరింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. అనిరుధ్ రవిచందర్ మాస్టర్ కి మరో పెద్ద హైలెట్. పాటలు సంగతి పక్కన పెడితే ఆర్ఆర్ తో దుమ్మురేపేశాడు. హీరో, విలన్ ఎలివేషన్స్ లో నేపధ్య సంగీతంతో ఆదరగొట్టాడు. ఆ ఆర్ఆర్ కి థియేటర్ విజల్స్ తో దద్దరిల్లిపోయేలా చేశాడు. కొంచెం లౌడ్ గా అనిపించినా విజయ్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది పండగ. ముఖ్యంగా తమిళ్ ఆడియన్స్ ఈ లౌడ్ ని ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి. మిగతా విభాగాలన్నీ ఓకే. 


కేవలం విజయ్ ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి తీసిన సినిమాల అనిపిస్తుంది మాస్టర్. దర్శకుడు కనకరాజ్ నుంచి ఖైదీ లాంటి వైవిధ్యమైన కంటెంట్ ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. అయితే ఇటు విజయ్ ఫ్యాన్స్, అటు విజయ్ సేతుపతి ఫ్యాన్స్ .. ఇద్దరికీ 'మాస్టర్' నచ్చేస్తాడు.


ప్ల‌స్ పాయింట్స్

విజ‌య్ సేతుప‌తి
విజ‌య్‌
మాస్ అంశాలు
ఎలివేష‌న్లు
బ్యాక్ గ్రౌండ్ స్కోరు


మైన‌స్ పాయింట్స్‌

సాగ‌దీత‌‌
క‌థ‌నంలో మెరుపులు లేక‌పోవ‌డం
నిడివి


ఫైనల్ వ‌ర్డిక్ట్‌: ఫ్యాన్స్ కి బావుంటుంది మేష్టారు..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS