తమిళనాడులో బీజేపీ పార్టీ సభ్యులు విజయ్ నటించిన మెర్సల్ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆ పార్టీ కే చెందిన ఒక ముఖ్య నాయకుడు సిద్ధార్థ్ మణి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకి వెళితే- మెర్సల్ చిత్రంలో వ్యాఖ్యలు GSTని వ్యతిరేకిస్తున్నట్టుగా భావించవద్దని అలాగే అది కేవలం సదరు చిత్ర యూనిట్ అభిప్రాయం క్రిందనే పరిగణించాలి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ అభిప్రాయానికి మెర్సల్ చిత్రాన్ని చూసాకే తాను వచ్చినట్టు తెలిపాడు. ఈ చిత్రాన్ని ఎప్పుడు చూసారు అని విలేకర్లు అడగగా- తాను ఇప్పుడే మెర్సల్ పైరసీ ప్రింట్ చూసి వచ్చానని చెప్పడం కొత్త వివాదానికి తెరతీసింది.
ఈ విషయం తెలుసుకున్న నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ అయిన విశాల్ స్పందిస్తూ- సమాజంలో ఇంతటి పేరు గౌరవం ఉన్న వ్యక్తి ఇలా పైరసీ లో చూసాను అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించాడు. తక్షణమే ఆయన చేసిన పనికి అందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనితో ఒక్కసారిగా ఈ పైరసీ వివాదం కొత్త రూపు సంతరించుకుంది.