ఒక వైపు నటి శ్రీదేవి డెత్ మిస్టరీ అంటూ కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా వారు మరోవైపు తమిళ హీరో విశాల్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందుకనే ఆయన ఆసుపత్రికి వెళ్ళాడు అంటూ కథనాలు ప్రసారమయ్యాయి.
అయితే వీటిని ఖండిస్తూ విశాల్ తన ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో తనకి ఉన్న ‘మైగ్రేన్’ వల్ల ఆసుపత్రికి వెళ్ళానే తప్ప మరేమీ లేదు అలాగే తన అభిమానులు ఆందోళనకి గురికావద్దు అని విజ్ఞప్తి చేశాడు.
అలాగే త్వరలోనే తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటాను అని కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఇటువంటి సమయంలో మీడియా అత్యుత్సాహం చూపడం వల్ల లేనిపోనీ వార్తలు హల్చల్ చేస్తున్నాయి అని భావించవచ్చు.
చివరికి విశాల్ కి ఏమి అవ్వలేదు అని ఆయన చేసిన ప్రకటనతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.