శ్రీదేవి అభిమానులకి సంచలన నిజాలు చెప్పిన వర్మ..

మరిన్ని వార్తలు

శ్రీదేవి మరణం ఆమెను నిత్యం ఆరాధించే దర్శకుడు ఆర్జీవీని తీవ్రంగా కలిచివేసినట్టు ఆయన చేస్తున్న ట్వీట్స్ చూస్తే మనకి అర్ధమవుతుంది.

అందులో భాగంగానే ఆయన కొద్దిసేపటి క్రింద శ్రీదేవి అభిమానులకి లేఖ పేరిట తన సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన లేఖని పోస్ట్ చేశాడు.

ఆ లేఖలో తన తండ్రి బతికి ఉన్న రోజుల్లో శ్రీదేవి ఎలా ఉండేది, ఆయన మరణించాక శ్రీదేవి సంపాదించిన ఆస్తులు ఏమయ్యాయి, ఆ తరువాత వ్యవహారం తెలియని వాళ్ళ అమ్మ చేతిలో నలిగిపోవడం, తరువాత కాలంలో బోనీ కపూర్ ఆమె జీవితంలోకి రావడం, శ్రీదేవి బోనీ కపూర్ ని వివాహం చేసుకున్నాక పరిస్థితులు ఎలా మారిపోయాయి అన్నది ఆ లేఖలో వర్మ పేర్కొన్నాడు.

అన్నిటికి మించి శ్రీదేవి ఎన్నడు తన వ్యక్తిగత జీవితంలో తనకి నచ్చినట్టుగా బ్రతకలేదు అని కేవలం యాక్షన్-కట్ కి మధ్యలోనే తను స్వేచ్చగా ఉండేది అని ఆమెని తాను అతిదగ్గరగా చూసిన వ్యక్తిగా ఈ విశ్లేషణ అందించానని చెప్పాడు.

ఇక ఎప్పుడూ స్వేచ్ఛగా బ్రతకని శ్రీదేవి కనీసం చనిపోయిన తరువాత అయినా స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉంటుంది అని కోరుకుంటున్నట్టుగా రాము తెలిపాడు. చివరగా #RIP శ్రీదేవి అని లేఖ ముగించాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS