'డిటెక్టివ్‌ 2': విశాల్‌ యాక్షన్‌ షురూ!

By Inkmantra - November 04, 2019 - 15:34 PM IST

మరిన్ని వార్తలు

తమిళ హీరో విశాల్‌ నటించిన 'డిటెక్టివ్‌' సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మంచి విజయం అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఆసక్తికరమైన సక్సెస్‌ అందుకుంది. అనూ ఇమ్మాన్యుయేల్‌ ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా నటించింది. యంగ్‌ హీరో జయం రవి కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ రూపొందనుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, సినిమా స్టార్ట్‌ చేయడం, రెగ్యులర్‌ షూట్‌ కూడా మొదలెట్టేయడం అన్నీ చకచకా జరిగిపోయాయ్‌.

 

ఇటీవలే విశాల్‌ తాజా చిత్రం 'యాక్షన్‌' షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్నాడు. సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో పూరీ జగన్నాధ్‌ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజాగా 'డిటెక్టివ్‌ 2' సినిమా రెగ్యులర్‌ షూట్‌ కోసం విశాల్‌ అండ్‌ టీమ్‌ యూరప్‌ వెళ్లింది. అక్కడే 43 రోజుల భారీ షెడ్యూల్‌ జరగనుంది.

 

ఈ సినిమాకి మిస్కిన్‌ దర్శకత్వం వహిస్తుండగా, అశ్యా హీరోయిన్‌గా నటిస్తోంది. మొదటి పార్ట్‌ని మించిన క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సస్పెన్స్‌ అంశాలు ప్రేక్షకుల్ని ఆధ్యంతం ఉత్కంఠకు గురి చేసేలా ఉంటాయట. ఈ సినిమా విశాల్‌ స్వీయ నిర్మాణంలో రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS