విశాల్ & కో నిన్ననే తమ చిరకాల కోరిక అదే విధంగా తమ ఎన్నికల ప్రధాన హామీ అయిన నడిగర్ సంఘం స్వంత భవనానికి భూమి పూజ నిర్వహించారు.
దీనికి నిన్న యావత్ తమిళ చిత్ర పరిశ్రమ తరలి వచ్చింది. అయితే వారు అనుకున్న విధంగా స్వంత భవనం సమకూరాలంటే రూ ౩౦ కోట్ల వరకు అంచనా వ్యయం అవుతుంది. దీనికి తమ వంతుగా హీరోలు విశాల & కార్తి లు రూ 10 కోట్లని విరాళంగా ప్రకటించారు.
ఈ ప్రకటన పెను సంచలనమే అయింది. అవ్వడమే కాక ఈ ఇద్దరు హీరోలు చేసిన ఈ పనికి పరిశ్రమ నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అనుకున్నది సాదించే క్రమంలో ఈ యువ హీరోలు చేస్తున్న పని అభినందనీయం.