టాలీవుడ్ లో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. ప్రభాస్ పేరే చెబుతారంతా. ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ప్రభాస్ ఎప్పుడూ స్పందించలేదు. ప్రభాస్‌పెళ్లి చేయాలని.. పెదనాన్న కృష్ణంరాజు ఎంతో ప్రయత్నించారు. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. 2023లో ప్రభాస్ పెళ్లి ఖాయమని చెబుతున్నా.. దానికి సంబంధించి ఎలాంటి స్పష్టతా లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా.. తమ హీరో పెళ్లెప్పుడవుతుందా అని ఎదురు చూసీ ఎదురు చూసీ అలసిపోయారు. ఇప్పుడు విశాల్ సైతం.. ప్రభాస్ పెళ్లి మేటరే.. పలవరిస్తున్నాడు. ప్రభాస్ పెళ్లికీ.. విశాల్ కీ లింకేమిటి? అనుకొంటున్నారా..? అక్కడికే వస్తున్నాం.
ప్రభాస్ కూడా.. విశాల్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే. తన పెళ్లిపై కూడా రకరకాల వార్తలొచ్చాయి, విశాల్ నిశ్చితార్థం జరిగి.. పెళ్లి వరకూ వెళ్లి, క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుంచీ.. విశాల్ పెళ్లి కూడా ప్రభాస్ పెళ్లిలానే సీరియల్ తంతులా సాగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో `మీ పెళ్లెప్పుడు` అనే ప్రశ్న విశాల్ కి ఎదురైంది. విశాల్ ఏమాత్రం తడుముకోకుండా `ప్రభాస్‌పెళ్లయ్యాకే నా పెళ్లి` అంటూ తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకొన్నాడు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలీదు. సో... విశాల్ పెళ్లి కూడా అంతే అనుకోవాలి. ఇంతకీ ప్రభాస్ పెళ్లి గురించి... విశాల్‌కి ఎందుకబ్బా..?