తమిళ హీరో విశాల్ తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాడులో విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది. ఎప్పటి నుండో విశాల్ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వస్తున్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో విశాల్ నుండి పోజిటివ్ రెస్పాన్స్ అయితే అందలేదు. కానీ సడెన్‌గా విశాల్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. ఈ రోజు ఇంకాస్సేపట్లో విశాల్ నామినేషన్ ఫైల్ చేయనున్నాడు.
ఆర్కే నగర్ నుండి విశాల్ పోటీ చేయనున్నాడు. ఇంత సడెన్‌గా విశాల్ పొలిటికల్ ఎంట్రీ అనౌన్స్‌మెంట్‌పై కోలీవుడ్ షాక్ తిన్నది. ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో అంతా విశాల్ పొలిటికల్ ఎంట్రీ వార్తలు ఉత్తదే అనుకున్న నేపథ్యంలో సడెన్‌గా పొలిటికల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. దాంతో అంతా షాక్ అయ్యారు. ఇంతవరకూ సినీ పరిశ్రమ నుండి చాలా మంది హీరోలు, హీరోయిన్లు కూడా పాలిటిక్స్‌లో సత్తా చాటుతున్నారు. కానీ వారందరిలోనూ విశాల్ పొలిటికల్ ఎంట్రీ ది స్పెషల్‌గా మారింది.
ఈ మధ్యనే నడిగర్ సంఘం నాయకుడుగా ఎన్నుకోబడ్డాడు విశాల్. జయలలిత మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నిక ఇది. ఈ ఎన్నికల్లో విశాల్ పోటీ చేసి గెలుపొందాడు. దాంతో తాజా ఎలక్షన్స్‌లో విశాల్ ప్రభావం ఎక్కువగా ఉండబోతోందనే చెప్పవచ్చు. ఇప్పటికే ఓ పక్క హీరోగా, నిర్మాతగా బిజీగా ఉన్నాడు విశాల్. ఈ మధ్యనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో 'డిటెక్టివ్' పేరుతో విడుదలైంది ఆ సినిమా. కాగా ఇప్పుడు రాజకీయాల్లోకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు.
కమల్‌హాసన్, రజనీకాంత్‌లు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్న ఈ తరుణంలో వారి కంటే ముందే వచ్చి సడెన్ షాక్ ఇచ్చాడు విశాల్. చూడాలి సినిమాల్లో హీరోగా సత్తా చాటిన విశాల్ రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తాడో చూడాలిక.