కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌.. విశాల్‌

By iQlikMovies - November 08, 2018 - 17:33 PM IST

మరిన్ని వార్తలు

స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలో నటిస్తానన్నాడుగానీ, ఇప్పటిదాకా ఆ ప్రయత్నమే చేయలేదు. తమిళ సినిమాలు చేసేసి, దానికి కాస్తంత తెలుగు టచ్‌ ఇచ్చేసి.. ఇది 'బై లింగ్వల్‌ మూవీ' అనేసి ఊరుకున్నాడు తమిళ హీరో విశాల్‌. 

తెలుగోడే కానీ, తమిళ సినిమాల్లో స్థిరపడ్డ ఈ యంగ్‌ హీరో, దర్శకత్వం వైపు టర్న్‌ అవుతున్నాడు. త్వరలోనే ఓ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. 2019 జనవరిలో తాను దర్శకత్వం వహించబోయే సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట విశాల్‌. ఇప్పటిదాకా నటుడిగా, నిర్మాతగా పలు సినిమాలు చేసిన విశాల్‌, ఇకపై దర్శకత్వంలో సినిమాలు చేస్తాననడం విశేషమే. 

నిజానికి, తొలుత విశాల్‌ దర్శకుడు అవుదామనే అనుకున్నాడట. అనుకోకుండా హీరోగా నటించాల్సి వచ్చిందట. ఏ సినిమా చేసినా, ఆ సినిమా నిర్మాణం సమయంలో తనలోని దర్శకుడు అప్పుడప్పుడూ తనను డామినేట్‌ చేసేవాడనీ, సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపైనా పట్టు సాధించేందుకు ఆయా అంశాల్ని అధ్యయనం చేసేవాడిననీ అంటున్నాడు విశాల్‌. 

ఆ అనుభవంతోనే కొన్ని కథల్ని అనుకున్నాననీ, వాటిలో కొన్నిటిని వర్కవుట్‌ చేయబోతున్నాననీ, త్వరలో తన దర్శకత్వంలో సినిమాపై అనౌన్స్‌మెంట్‌ వుంటుందనీ విశాల్‌ ఇటీవల 'పందెం కోడి-2' ప్రమోషన్స్‌ సందర్భంగా చెప్పిన సంగతి తెల్సిందే. ఇప్పుడు ఆ మాటల్ని ఆచరణలో పెట్టేస్తున్నాడట. ఇది తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కే 'ద్విభాషా' చిత్రం అవుతుందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS