నడిగర్ సంఘం ప్రాధాన్ కార్యదర్శి, హీరో విశాల్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేశాడు.
తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణంతో ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఇక ఆ స్థానానికి ఈ నెలలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో స్వంతత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్నట్టు హీరో విశాల్ ప్రకటించాడు.
సోమవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. ఇక కమల్ హాసన్ ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించగా ఇప్పుడు విశాల్ ఏకంగా ఎన్నికల బరిలోకి దిగడం చర్చనీయంశంగా మారింది.
మరి విశాల్ గెలుస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.