మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా పై భారీ అంచానాలే ఉన్నాయి. న్యూజిలాండ్ లో 90 రోజుల లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న కన్నప్ప టీమ్, రీసెంట్ గా ఇండియా వచ్చింది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, ఈ సినిమాలో నటీ నటుల్ని రోజు కొకర్ని రివీల్ చేస్తూ క్రేజ్ అప్డేట్స్ ఇచ్చేవారు విష్ణు. మళ్ళీ ఇన్నాళ్లకు అలాంటి అప్డేట్ తో ముందుకొచ్చారు విష్ణు. తండ్రి కొడుకుతో పాటు మనవడు కూడా ఈ మూవీలో నటిస్తున్నట్టు సమాచారమిచ్చాడు. అదే నండీ విష్ణు వారసుడు 'అవ్రామ్' కన్నప్ప మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. విష్ణు కొడుక్కి ఇప్పుడు ఐదేళ్లు. అవ్రామ్ సినిమా జర్నీ కన్నప్ప లాంటి అద్భుతమైన దృశ్యకావ్యంతో మొదలుపెడితే మంచిదని విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నాడట.
నామ్ కే వాస్తీ ఎంట్రీ కాకుండా అవ్రామ్ పాత్రకు కన్నప్పలో చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. పుత్రోత్సహంతో విష్ణు స్పందిస్తూ "ఈ 'కన్నప్ప' సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం" అంటూ పేర్కొన్నాడు. "అవ్రామ్‌తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. సినీ ప్రేమికులందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాను. 'కన్నప్ప' ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది" అని పేర్కొన్నారు.
మహాభారత్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విష్ణు సరసన కృతి సనన్ సిస్టర్ నుపుర్ సనన్ నటిస్తోంది. మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Beyond thrilled as a new era unfolds! Avram Manchu steps into the cinematic universe with 'Kannappa,' adding another glorious chapter to the Manchu family and carries the generational torch forward.#AvramManchu @ivishnumanchu @24framesfactory @avaentofficial#Kannappa… pic.twitter.com/SVZrlNgG6N
— Kannappa The Movie (@kannappamovie) January 5, 2024