‘పాగల్‌’గా మారిన విశ్వక్సేన్‌.!

మరిన్ని వార్తలు

‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమాతో డెబ్యూ చేసిన హీరో విశ్వక్సేన్‌ కొత్త చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా లాంఛ్‌ కానుంది. బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పాగల్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇటీవలే నేచురల్‌ స్టార్‌ నాని సొంత బ్యానర్‌లో రూపొందిన ‘హిట్‌’ సినిమాతో హిట్‌ కొట్టిన విశ్వక్సేన్‌, శైలేష్‌ కొలనును ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం చేశాడు. ఇప్పుడు మరో నూతన దర్శకున్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. నరేష్‌ కుప్పిలి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్‌ అవుతున్నాడు.

 

టైటిల్‌ లోగోతో కూడిన పోస్టర్‌ని రిలీజ్‌ చేస్తూ, ఈ కొత్త సినిమా ముచ్చటను రివీల్‌ చేసింది చిత్ర యూనిట్‌. ‘పాగల్‌’ అనే టైటిల్‌ చాలా క్యాచీగా ఉంది. మరి, కథా, కథనాలు, ఇతర టెక్నీషియన్ల వివరాలేంటో త్వరలో వెల్లడి కానున్నాయి. తొలి సినిమాకే సెన్సేషనల్‌ స్టార్‌ అనిపించుకున్న విశ్వక్సేన్‌, ‘హిట్‌’ అనే చిన్న సినిమాతో తన స్టామినా ఏంటో చూపించాడు. మరి ముచ్చటగా మూడో చిత్రంగా రూపొందుతోన్న ‘పాగల్‌’తో ఎలాంటి సెన్సేషన్‌ సృష్టిస్తాడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS