ఆ వార్త‌ల‌న్నీ అవాస్త‌వం!

మరిన్ని వార్తలు

`హిట్‌`తో ఓ మంచి హిట్టు కొట్టాడు విశ్వ‌క్‌సేన్‌. అంత‌కు ముందు `ఈ న‌గ‌రానికి ఏమైంది`, `ఫ‌ల‌క్ నామా దాస్‌` కూడా విశ్వ‌క్‌కి మంచి పేరే తీసుకొచ్చాయి. ప్ర‌స్తుతం `పాగ‌ల్`గా క‌నిపించ‌బోతున్నాడు. ఈలోగా విశ్వ‌క్‌పై మ‌రో వార్త వ‌చ్చింది. త‌మిళ రీమేక్ `ఓ మై క‌ద‌వులే` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో విశ్వ‌క్ సేన్ హీరో అని వార్త‌లొచ్చాయి. అయితే... ఈ వార్త‌ల‌న్నీ అవాస్త‌వాలే అని తేలింది. తాను ఏ రీమేక్‌లోనూ న‌టించ‌డం లేద‌ని, త‌న చేతిలో `పాగ‌ల్` మాత్ర‌మే ఉంద‌ని క్లారిటీ ఇచ్చేశాడు.

 

విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం `ఓ మై క‌ద‌వులే`. త‌మిళంలో బాగా ఆడింది. అందుకే పీవీపీ సంస్థ తెలుగులో రీమేక్ చేయ‌డానికి సన్నాహాలు మొద‌లెట్టింది. ఇటీవ‌ల ఈ సినిమా చూశాడు విశ్వ‌క్‌. అప్ప‌టి నుంచీ ఈ రీమేక్‌లో విశ్వ‌క్ న‌టిస్తున్నాడ‌న్న వార్త‌లు జోరందుకున్నాయి. అందుకే ఇప్పుడు విశ్వ‌క్‌సేన్ క్లారిటీ ఇవ్వాల్సివ‌చ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS