డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో విశ్వక్ పాత్రలోని రెండు షేడ్స్‌ని చూపించే అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికరంగా వుంది. పోస్టర్‌లో క్లాస్‌తో పాటు మాస్ అవతార్ లో కనిపించారు విశ్వక్ సేన్.
అత్యంత భారీ బడ్జెట్‌తో వున్నత నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రానికి విశ్వక్ కథానాయకుడు, దర్శకుడు నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది
మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, రామ్ మిరియాల మావా బ్రో పాటను స్పెషల్ గా కంపోజ్ చేశారు. థియేట్రికల్ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది.