'హిట్' విజయం తర్వాత విశ్వక్ సేన్ చేసిన పాగల్ పెద్దగా రాణించలేదు. అయితే ఇప్పుడో రిమేక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశ్వక్. తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రం ఓ మై కడవులే. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో చేస్తున్నాడు. తాజాగా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీవ్ చేశారు. చిత్రానికి 'ఓరి దేవుడా' అనే టైటిల్ పెట్టారు.
క్రైస్తవ ఆచారంలో పెళ్లికి సిద్ధమౌతున్న ఓ జంట.. వరుడు సీతాకోక చిలుక కోసం గాల్లోకి ఎగరగా.. వదువు అతడ్ని తాడుతో కట్టి లాగడం ఈ మోషన్ పోస్టర్ లో చూపించారు. ఈ సినిమాని పివిపి సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన అశ్వత్ మరిముత్తు నే దర్శకత్వం వహిస్తున్నాడు. లియోన్ జేమ్స్ సంగీతం. అన్నట్టు ఈ చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాయడం విశేషం.