ఫలక్‌నామా దాస్, హిట్, పాగల్ చిత్రాలతో ఆకట్టుకున్న యువ హీరో విశ్వక్‌సేన్. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగాఉన్నాడు. కొత్తగా మరో సినిమాని పట్టాలెక్కించాఉడ. విశ్వక్‌సేన్, నివేదా పేతురాజ్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. నరేష్ కుప్పిలి దర్శకుడు. ఈ చిత్రానికి `దమ్కీ` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదో కామెడీ థ్రిల్లర్. యాక్షన్ అంశాలూ ఉంటాయి. బుధవారం నుంచే షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. ఈ నెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రానికి కథ, మాటలు ప్రసన్నకుమార్ బెజవాడ అందించారు. విశ్వక్ నటించిన అశోక వనంలో అర్జున కల్యాణం విడుదలకు సిద్ధంగా ఉంది.