తెలుగు తెరపై అచ్చమైన ప్రేమకథ చూసి చాలా రోజులైంది. విశ్వక్ సేన్ ఆ లోటు తీర్చబోతున్నాడు. ఈ సినిమాలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు లవ్ స్టోరీలు ఉండబోతున్నాయ్ట. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ స్వయంగా చెబుతున్నాడు. ``చాలా మంది నన్ను లవ్‌స్టోరీ చేయమని అంటుంటే.. ఏకంగా ఐదు లవ్‌స్టోరీస్ ఉండే సినిమాను చేశాను. అదే పాగల్. టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌లో కనిపించని ఓ హీరోయిన్ సినిమాలో మాత్రమే కనిపించబోతుంది. ఆమె ఎవరో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు.. ప్రేమ గురించి చెప్పే కథ’’ అన్నారు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ కథానాయిక. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ఈనెల 14న విడుదల అవుతోంది. నిజానికి ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. చివరి క్షణాల్లో థియేటర్ రిలీజ్ కి సిద్ధమైంది. ``ఈ టైమ్ లో సినిమాని రిలీజ్ చేయడం చాలా రిస్క్. నేనూ, బెక్కం వేణుగోపాల్ రెండు రూపాయల రిస్క్ చేస్తే.. ఈ సినిమాపై నమ్మకంతో దిల్ రాజు నాలుగు రూపాయల రిస్క్ చేశారు. ఇదంతా ఈ సినిమాపై మాకున్న ప్రేమే`` అంటున్నాడు విశ్వక్. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.