ఎన్టీఆర్ కోసం.. ఫ‌ల‌క్‌నామాదాస్ గీతం!

మరిన్ని వార్తలు

స్టార్ హీరో పుట్టిన రోజంటే.. ఫ్యాన్స్‌కి పండ‌గ రోజే. ఆ హీరో సినిమాకి సంబంధించిన టీజ‌రో, ట్రైల‌రో, క‌నీసం ఫ‌స్ట్ లుక్కో వ‌స్తుంద‌ని ఆశ‌గా ఎదురుచూస్తుంటారు. మే 20న త‌న పుట్టిన రోజు జ‌రుపుకోబోతున్నాడు ఎన్టీఆర్‌. ఈ సంద‌ర్భంగా `ఆర్‌.ఆర్‌.ఆర్‌` నుంచి ఓ టీజ‌ర్ వ‌స్తుంద‌ని ఆశ ప‌డ్డారు. కానీ లాక్ డౌన్ వ‌ల్ల టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డం కుద‌ర‌డం లేద‌ని, క‌నీసం ఫ‌స్ట్ లుక్ కూడా చూపించలేక‌పోతున్నామ‌ని ఆర్‌.ఆర్‌.ఆర్ బృందం తేల్చేసింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నిరాశ ప‌డ్డారు.

 

అయితే ఈ లోటు తీర్చేస్తున్నాడు విశ్వ‌క్‌సేన్‌. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా, బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఓ రాప్ గీతాన్ని విడుద‌ల చేస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమాలు, అత‌ని స్టైల్‌... వీటిపై సాగే పాట ఇది. ఈ పాట ఎన్టీఆర్ అభిమానుల‌కు అంకితం అంటున్నాడు విశ్వ‌క్‌సేన్‌. ఫ‌ల‌క్‌నామా దాస్‌, హిట్ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వ‌క్‌. త‌న‌లో మంచి ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడు. స్వ‌త‌హాగా విశ్వ‌క్ ఎన్టీఆర్ అభిమాని. త‌న ఇష్టాన్ని ఈ పాట రూపంలో విశ్వ‌క్ చూపించుకోబోతున్నాడు. మ‌రి ఆ పాట ఎలా ఉందో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS