వసూళ్ళ 'విశ్వరూపం' చూపిస్తాడా?

మరిన్ని వార్తలు

విశ్వ నటుడు కమల్‌హాసన్‌ తాజా చిత్రం 'విశ్వరూపం-2' ట్రైలర్‌ వచ్చింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ ట్రైలర్‌ని సోషల్‌ మీడియా ద్వారా రిలీజ్‌ చేశాడు. యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ హ్యాండ్‌, 'విశ్వరూపం-2' సినిమాకి పాజిటివ్‌ వైబ్‌ క్రియేట్‌ చేస్తుందనే అభిప్రాయాలు ఓ పక్క వ్యక్తమవుతున్నాయి. 

వాస్తవానికి 'విశ్వరూపం-2' ఎప్పుడో విడుదల కావాల్సి వుంది. కొద్ది రోజుల గ్యాప్‌లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో 'విశ్వరూపం-1', 'విశ్వరూపం-2' సినిమాలకు ప్లాన్‌ చేశాడు కమల్‌హాసన్‌. తానే నిర్మాతగా, దర్శకుడిగా 'విశ్వరూపం-1', 'విశ్వరూపం-2' సినిమాల్ని ప్లాన్‌ చేసినా, కొన్ని కారణాలతో నిర్మాత మారినా, నిర్మాణ ఒత్తిడిని పూర్తిగా కమల్‌ భరించాల్సి వచ్చింది. ఎలాగైతేనేం, టీజర్‌ వచ్చింది. లేట్‌గా వస్తేనేం, లేటెస్ట్‌గా వచ్చేశాడు కమల్‌. హాలీవుడ్‌ స్థాయి మేకింగ్‌ 'విశ్వరూపం-2' ట్రైలర్‌లో కన్పించింది. 

కమల్‌ నుంచి ఏ సినిమా వచ్చినా అంతే. టెక్నికల్‌గా సౌండింగ్‌ అదిరిపోతుంది. విజువల్స్‌ కళ్ళు చెదిరేలా వుంటాయి. 'విశ్వరూపం-1' సినిమాని నిర్మించి, దాన్ని విడుదల చేయడానికి కమల్‌, ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ సినిమా చుట్టూ అన్ని వివాదాలొచ్చాయి. ఇప్పుడూ అలాంటి వివాదాలు తప్పవని కమల్‌ స్వయంగా అంచనా వేస్తున్నాడు. 

ఈసారి సినిమాపై వివాదాలొస్తే, రాజకీయ నాయకుడిగా ఎదుర్కొంటానని సంకేతాలిచ్చాడు. 'మక్కల్‌ నీది మయ్యమ్‌' అనే పార్టీ పెట్టిన కమల్‌, తమిళనాడు రాజకీయాల్లో సత్తా చాటాలనుకుంటున్న సంగతి తెల్సిందే. ఆ రాజకీయానికీ ఈ 'విశ్వరూపం-2' ఉపయోగపడేలానే వుంది. ఏదేమైనా, వసూళ్ళ 'విశ్వరూపానికి' సిద్ధమవుతున్న కమల్‌, అంచనాలకు తగ్గ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలిక.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS