అల్లుడి కోసం వస్తున్న మెగాస్టార్ చిరంజీవి..!

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల అయ్యింది. రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మిస్తున్న సినిమా "విజేత".  కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.ఇటీవల విడుదలైన విజేత టీజర్ కు మంచి స్పందన వచ్చింది. జులై మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విజేత చిత్ర నిర్మాతలు ఆడియో విడుదల తేదీని ఖరారు చెయ్యడం జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా జూన్ 24న భారీ స్థాయిలో  "విజేత" ఆడియో ఫంక్షన్ జె.ఆర్.సి కన్వెన్షన్ లో జరగబోతోంది. చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. బాహుబలి కెమెరామెన్ కె.కె.సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ సినిమాకు హర్షవర్ధర్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ  ముఖ్య పాత్రలో నటించడం జరిగింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS