'అర్జున్‌రెడ్డి' సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన హీరో విజయ్ దేవరకొండ. అలాంటిది 'అర్జున్‌రెడ్డి'ని ఎవరైనా మర్చిపోతారా? ఈ సినిమా సృష్టించిన వివాదాలిన్నీ అన్నీ కావు. రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ సినిమా మాత్రం అనూహ్యంగా గొప్ప విజయం సాధించింది. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కిచారు.
డైరెక్టర్‌గా ఈ ఏడాది బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు సందీప్ రెడ్డి. ఎన్టీఆర్, చరణ్ తదితర హీరోలను మెప్చించాడీ దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవితో ప్రశంసలు దక్కించుకున్నాడు. రాజమౌళి మెచ్చిన చిత్రంగా 'అర్జున్‌రెడ్డి' కీర్తికెక్కింది. అలాగే సంచలనాల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ విజయ్ దేవరకొండని తెలంగాణా మెగాస్టార్ అని అభివర్ణించాడు. ఇదో ప్రత్యేకమైన ప్రశంస విజయ్‌కి. ఇన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్న 'అర్జున్‌రెడ్డి'ని మర్చిపోవడమేంటా? అనే కదా మీ అనుమానం. దీనికి కారణం విజయ్ దేవరకొండ, తర్వాత చేయబోయే చిత్రమట.
అదే 'ట్యాక్సీవాలా'. ఈ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోందట. 'అర్జున్‌రెడ్డి'ని మించిన హీరోయిజం, ఉంటుందట. ఈ సినిమా వచ్చాక 'అర్జున్‌రెడ్డి'ని మర్చిపోతారనీ విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పాడు. ఇదో సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యాబ్ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. క్యారెక్టర్‌లో కొత్తదనం లేకపోయినా, కథా, కథనాలు, స్క్రీన్‌ప్లే అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయనీ విజయ్ అంటున్నాడు. ఈ సినిమాతో పాటు 'ఏం మంత్రం వేశావె' చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.
విజయ్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రంలోనూ విజయ్ పాత్ర సరికొత్తగా ఉండబోతోందట.