దర్శకుడిగా అగ్ర స్థాయిని అందుకొన్నాడు వినాయక్. ఒకప్పుడు వినాయక్ తో సినిమా చేయడానికి అగ్ర హీరోలంతా పోటీ పడేవారు. దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసి హిట్లు కొట్టాడు వినాయక్. కొన్నేళ్లుగా వినాయక్ ఫామ్ లో లేడు. ఇప్పుడు తెలుగు ఛత్రపతిని హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రీమేక్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తికావొచ్చింది. అయితే ఇప్పుడు వినాయక్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. తాను త్వరలోనే హీరోగా వెండి తెరపై రానున్నాడట. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయ్యిందని టాక్.
ఇది వరకు వినాయక్ హీరోగా, దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా ప్రకటించారు. అయితే అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆసినిమా కోసం అప్పట్లో వినాయక్ బరువు తగ్గడం గుర్తుండే ఉంటుంది. హీరోగా చేయాలన్న ప్రయత్నం బెడసికొట్టడంతో.. వినాయక్ నిరుత్సాహానికి గురయ్యాడని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం వచ్చింది. ఈసారైనా.. వినాయక్ హీరోగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందో లేదో చూడాలి. అన్నట్టు ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తారని తెలుస్తోంది. దర్శకుడు, నిర్మాతా, హీరో తానే కాబట్టి.. ఈ సినిమాకి ఎలాంటి ఆటంకాలూ లేకపోవొచ్చు.