వినాయక్ కథానాయకుడిగా దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా మొదలైంది. అదే `శీనయ్య`. నరిసింహారావు దర్శకుడు. ఈమధ్య భారీ ఎత్తున ప్రారంభోత్సవం జరుపుకుంది. హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఈ స్క్రిప్టుపై దిల్ రాజు ఏమాత్రం సంతృప్తికరంగా లేడని, అందుకే స్క్రిప్టు మార్చమన్నాడని తెలుస్తోంది. అంత వరకూ ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే ప్రస్తకే లేదని తెగేసి చెప్పాడట. దాంతో నరసింహారావు కథలో మార్పులు చేర్పులూ చేయడానికి రెడీ అయ్యాడు. అయినప్పటికీ దిల్ రాజు అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా లేకపోతే, ఆగిపోవడం ఖాయం.
అయితే ఈ సినిమాపై వినాయక్ చాలా హోప్ట్ పెట్టుకున్నాడు. దర్శకత్వం కూడా మానేసి, నటనపై దృష్టి పెట్టాడు. బరువు కూడా తగ్గాడు. తన స్టైలింగ్ మార్చాడు. ఇన్ని చేశాక కూడా సినిమా ఆగిపోతే... అది వినాయక్ కే నష్టం. మరి శీనయ్య ముందుకు వెళ్తాడో, లేదో చూడాలి.