ఆ చెడ్డీ పాప జాన్వీ కపూర్‌.. నిజమేనా.?

మరిన్ని వార్తలు

జాన్వీకపూర్‌ పేరుతో కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మైక్రో షార్ట్‌ ధరించి కారులో ఎక్కుతున్న హీరోయిన్‌ ఫోటోలవి. ముఖం తెలియడం లేదు కానీ, 'అవి జాన్వీ ఫోటోలే.. గతంలో చాలాసార్లు జాన్వీ ఇలాంటి మైక్రో షార్ట్స్‌లో దర్శనమిచ్చింది..' అంటూ నెటిజన్స్‌ కన్‌ఫామ్‌ చేసేసుకుంటున్నారు.

అయితే, నిజంగానే ఆ ఫోటోలు జాన్వీవేనా.? చాలా వల్గర్‌గా ఉన్నాయంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జాన్వీకి ఇదేం కొత్త కాకపోయినా, ఈ ఫోటోలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. అయితే, కొందరు మాత్రం ఆ ఫోటోస్‌లో ఉన్నది జాన్వీ కాదంటున్నారు. బాడీ లాంగ్వేజ్‌, బిఫోర్‌ హిస్టరీ తీసుకుంటే అవి జాన్వీ ఫోటోసే.. అంటూ ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఈ తాజా హాట్‌ పిక్స్‌పై సోషల్‌ మీడియా వేదికగా పెద్ద రచ్చ జరిగిపోతోంది. ఈ రచ్చలో అసలు నిజం తెలియాలంటే జాన్వీ కపూర్‌ రెస్పాండ్‌ అవ్వాలి. అయితే, ఇలాంటి ఇష్యూస్‌పై జాన్వీ పెద్దగా రెస్పాండ్‌ అయిన దాఖలాల్లేవు. మరి ఈ రచ్చని జస్ట్‌ పబ్లిసిటీగా తీసుకుని లైట్‌ తీసుకుంటుందా.? లేక మినిమమ్‌ రెస్పాన్సిబులిటీ అని తనదైన శైలిలో రెస్పాండ్‌ అవుతుందా.? చూడాలి మరి.

ఇదిలా ఉంటే, రేపో మాపో జాన్వీ కపూర్‌ సౌత్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ సినిమాతో జాన్వీ సౌత్‌ ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్‌ వినిపిస్తోంది. పూరీ జగన్నాధ్‌ ఈ సినిమాకి దర్శ, నిర్మాతగా వ్యవహరిస్తుండగా, బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ కూడా నిర్మాణంలో భాగం పంచుకోనున్నారు. మరోవైపు జాన్వీ కపూర్‌ హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS