చిరంజీవి ఇంట్లో నిత్యం ఏదో ఓ పార్టీ జరుగుతూనే ఉంటుంది. డిసెంబరు 31 రాత్రి.. `వాల్తేరు వీరయ్య` టీమ్‌కి స్పెషల్ గా పార్టీ ఇచ్చారు చిరు. వాల్తేరు వీరయ్య విజయాన్ని ముందుగా ఊహించిన చిరు.... టీమ్ కి ముందస్తు పార్టీ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు మరోసారి.. టీమ్ అందరినీ పిలిచి ఘనంగా పార్టీ ఇచ్చాడు చిరంజీవి. శుక్రవారం రాత్రి చిరు ఇంట్లో ఈ స్పెషల్ పార్టీ జరిగినట్టు టాక్. ఈ పార్టీలో వాల్తేరు వీరయ్య టీమ్ తో పాటుగా, భోళా శంకర్ టీమ్ కూడా హాజరైందని సమాచారం.
చిరంజీవి 9 ఏళ్ల విరామం తరవాత మళ్లీ సినిమాలు మొదలెట్టాక... టాలీవుడ్ లో ఆయనకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఖైది నెం.150 హిట్ అయ్యింది. సైరా యావరేజ్ దగ్గర ఆగింది. ఆచార్య అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. గాడ్ ఫాదర్ జస్ట్ ఓకే అనిపించుకొంది. వాల్తేరు వీరయ్య మాత్రం చిరంజీవి స్టామినాకు అద్దం పట్టింది. ఈ సినిమా దాదాపుగా రూ.150 కోట్లు వసూలు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనే కాదు.. చిరు కెరీర్లోనే ఇవే రికార్డు వసూళ్లు. అందుకే చిరు.. ఘనంగా పార్టీ ఇచ్చాడని తెలుస్తోంది.