పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీనికి సమాధానం ఇచ్చింది 'వాల్తేరు వీరయ్య' టీం. ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల 'పూనకాలు లోడింగ్' పాట బయటికి వచ్చింది. టైటిల్ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్‌లను స్కోర్ చేయడంలో దిట్ట రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ పాడారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో ''డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్'' అనడం పూనకాలని రెట్టింపు చేసింది.
చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది. జాతర సెటప్, భారీ జనసమూహం ఈ మాస్ నంబర్ అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బావుంది ఉంది. చిరంజీవి, రవితేజల బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా ఉపయోగించాడు. చిరంజీవి మాస్ లుక్, గెటప్.. ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు లాంటి బ్లాక్‌బస్టర్స్ ని గుర్తుకుతెస్తుంది. రవితేజ తేజ సూపర్ ఎనర్జిటిక్ గా కనిపించాడు. భారీ అంచనాల వున్న వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.