చిరంజీవి, రవితేజ కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ . శ్రుతి హాసన్ కథానాయిక. కె.బాబీ దర్శకుడు. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య సినిమా ఎలా వుంటుందనే ప్రశ్నకు చిరు సమాధానం ఇచ్చారు.
''వీరయ్య కచ్చితంగా రొటీన్ ఎంటర్‌టైనర్. కానీ, షాక్ అయ్యేంత వైవిధ్యమైన ఎమోషన్ అందులో ఉంటుంది. ఎప్పుడూ మనం ఒకే రకమైన భోజనం చేస్తాం. రొటీన్ భోజనం అని అనుకోం. స్పెషల్ ఐటెమ్స్ బట్టి అది ఆధారపడి ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు. ''దర్శకుడు బాబీ మనోగతం ఈ చిత్రం. తను చిన్నప్పుడు తెరపై నన్ను చూసి ఎలా ఆనందపడ్డాడో.. అలాంటి దృశ్యాలనే చూడాలనుకున్నాడు. తాను కోరుకున్నట్టు కనిపించేలా నేను సన్నద్ధమయ్యా'' అన్నారు చిరు.