హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ డాన్స్

మరిన్ని వార్తలు

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వార్ 2 తో బాలీవుడ్ లోకి నేరుగా అడుగుపెడుతున్నాడు. 'దేవర' బిజీ షెడ్యూల్ తో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 షూటింగ్ లో పాల్గొనటానికి ముంబై వెళ్ళాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరెకెక్కుతున్న ఈ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు.  ఈ మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి,  ఎన్టీఆర్, హృతిక్ ఫాన్స్ తో పాటు, సినీ ప్రియులని కూడా ఆకట్టుకుంటోంది. నాటు నాటు తరహాలో హృతిక్, ఎన్టీఆర్ లతో కలిసి ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. RRR సినిమాలో నాటు నాటు పాటకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి వేసిన స్టెప్స్ ఒక ఊపు ఊపాయి. అదే రేంజ్ లో వార్ 2 లో కూడా హృతిక్, ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేయనున్నారని సమాచారం.  


ఇండియాలో ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో హృతిక్ ఒకరు. ఎన్టీఆర్ డాన్స్ గూర్చి సౌత్ లో అందరికి తెలుసు. నాటు నాటు పాటతో వరల్డ్ వైడ్ గా మంచి డాన్సర్ గా గుర్తింపు పొందాడు. అలాంటిది   వీరిద్దరూ కలిసి చిందేస్తే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. వార్ వన్ సైడ్ కాదు టూ సైడ్స్ అన్నట్టు ఉంటుంది వీరి పర్ఫామెన్స్.  వీరి కాంబోలో ఊర మాస్ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ ప్రత్యేక శ్రద్ద పెట్టి ఈ సాంగ్ స్పెషల్ గా డిజైన్ చేశారట. ఎన్టీఆర్ తో మొదట పాట చిత్రించి, తరవాత షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారని సమాచారం. 


యశ్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో దాదాపు పది రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ జరగనున్నట్లు   బీటౌన్ టాక్.  హృతిక్, తారక్ డాన్స్ స్టయిల్ కి అనుగుణంగా ఈ సాంగ్ కోసం ఇద్దరు కొరియోగ్రాఫర్లు పనిచేయనున్నట్లు, ఇప్పటికే వీరిద్దర్నీ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ నుంచి గణేష్ మాస్టర్, టాలీవుడ్ నుంచి జానీ మాస్టర్ కలిసి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కొన్ని హుక్ స్టెప్స్ ని డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS