థియేటర్ లో సినిమా చూసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరచుకుంటున్నాయి. అయితే ఇంకా ఎన్నో భయాలు. అందుకే ఓటీటీలు,ఏటీటీలకు ఆదరణ పెరుగుతోంది. వాటిలో సినిమాల్ని చూపించుకోవడానికి సైతం కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఫ్రై డే మూవీస్ అనే కొత్త ఏటీటీ వచ్చింది. ఈనెల 18 నుంచి ఇందులో సినిమాలు చూడొచ్చు. తొలి సినిమాగా.. `డర్టీ హరీ` ప్రదర్శితం అవుతోంది. ఎం.ఎస్.రాజు దర్శకత్వం లో రూపొందిన చిత్రమిది. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ కథానాయికలు ఈ నెల 18 న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్బంగా చిత్ర సమర్పకులు గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ '’ఈ సినిమా ట్రైలర్ కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మేము విడుదల చేసిన ఫుల్ వీడియో సాంగ్ కోటి వ్యూస్ కి అతి సమీపం లో ఉంది. ఈ ట్రైలర్, ఈ సాంగ్ తో అటు ప్రేక్షకులలోను , ఇటు పరిశ్రమలోను అనూహ్యమైన బజ్ వచ్చింది. ఈ బజ్ కి గొప్ప విజువల్స్ ఒక కారణం కాగా, ఎం.ఎస్.రాజు డైరెక్షన్ ప్రధాన కారణం.దేవి, వర్షం, ఒక్కడు , మనసంతా నువ్వే ,నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బాస్టర్స్ నిర్మించిన ఎం.ఎస్.రాజు దర్శకునిగా ఒక కొత్త పంధాలో ఈ సినిమా ని తీర్చిదిద్దారు. ఫస్ట్ కాపీ చూసిన 'హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్' సంస్థ అధినేతలు కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి ఫ్యాన్సీ రేటుతో ఈ సినిమా కొనుగోలు చేసారు. 'ఫ్రైడే మూవీస్' యాప్ ఈ సినిమాతోనే ప్రారంభం కానుంది. ఈ యాప్ లో కొంతమంది ప్రముఖులు ఇన్ వాల్వ్ అయి ఉన్నారు. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి 7997666666 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది`` అన్నారు.