అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం 12 గంటలకు ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన వెంటనే చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కి తరలించారు. అటునుంచి అటే గాంధీ హాస్పటల్ కి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. నెక్స్ట్ నాంపల్లి కోర్టు ముందు హాజరు పరిచారు. నాంపల్లి కోర్టు ఇరు వైపు వాదనలు విన్న తరవాత ఆలు అర్జున్ కి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వెంటనే చంచల్ గూడా జైలుకి తరలించారు. ఈ లోగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో శనివారం ఉదయం రిలీజ్ చేశారు.
నార్మల్ గా అయితే శుక్రవారం రాత్రి రిలీజ్ చేయాల్సి ఉండగా, బెయిలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అధికారులకి అందటం లేట్ అవటం వలన, పూచి కత్తులో ఏవో మిస్టేక్స్ ఉన్నాయన్న కారణంతో శనివారం పొద్దుట రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన బన్నీని భారీ బందోబస్తుతో ఎస్కార్ట్ వాహనంలో ఇంటికి పంపించారు. ఫైనల్ గా శుక్రవారం అరెస్టైన బన్నీ శనివారం రిలీజై రెండు తెలుగురాష్ట్రాల ప్రజలకి ఊరట నిచ్చారు. బన్నీ అరెస్ట్ అన్న విషయం తెలిసిన దగ్గరనుంచి ఫాన్స్ ఆందోళనతో టీవీలకే అతుక్కుపోయారు.
జనవరి 21 వరకు బన్నీ బెయిల్ లభించింది. నెక్స్ట్ క్వాష్ పిటీషన్ జరగనుంది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో అప్లై చేసుకోవాలని హైకోర్టు సూచించింది. డిసెంబర్ 4న RTC క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్యా థియేటర్ కి బన్నీ ప్రీమియర్ షో చూడటానికి వెళ్లగా అక్కడ తొక్కిసలాటలో ఒక కుటుంబానికి చెందిన రేవతి మరణించారు. ఆమె పదమూడేళ్ల కొడుకు హాస్పటల్లో ఉన్నారు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకుండా, ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకుండా అల్లు అర్జున్ వెళ్ళటం వలనే ఇలాంటి అవాంఛనీయ ఘటన జరిగిందని థియేటర్ యాజమాన్యంపై, అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయ్యింది. బన్నీ A11 అయినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయటం గమనార్హం.
చంచల్ గూడా జైల్లో నైట్ అంతా ఉన్న బన్నీని మంజీరా బేరక్ లో ఉంచారు. రాత్రంతా తిండి లేక, నిద్ర లేక ఇబ్బంది పడినట్లు సమాచారం. కేవలం టీ స్నాక్స్ తీసుకుని పడుకున్నారట. జైలు సిబ్బంది కొత్త బ్లాంకెట్ ఇచ్చినా తిరస్కరించి అందరిలానే నేలపై నిద్రించాడట. బన్నీ జీవితంలో ఇదొక బ్లాక్ డే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.