అర్ధరాత్రి కంటెస్టెంట్స్‌ని నిద్రలోంచి లేపి, లగేజ్ ప్యాక్ చేసుకోమని ఆదేశించాడు బిగ్‌బాస్. నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురినీ లగేజ్ ప్యాక్ చేసుకుని, గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన వారి వారి క్యాబిన్స్‌లో నిలబడమని చెప్పి, కాసేపు కంటెస్టెంట్స్‌ని అయోమయంలోని నెట్టేశాడు. తర్వాత ఇన్ని రోజుల వారి జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకోమని సెలవిచ్చాడు. తమ తమ జర్నీ అనుభవాల్ని కంటెస్టెంట్లు ఆ సందర్భంగా షేర్ చేసుకున్నారు. చివరికి ఆ ఐదుగురిలోంచి ఒకరిని సేవ్ చేశాడు. ఆయనే బాబా భాస్కర్. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే బాబా భాస్కర్ సేవ్ అయ్యాడు.
ఇంత హైడ్రామా ప్లే చేసిన బిగ్‌బాస్, ప్రేక్షకుల అభిమానం మేరకే మీరు సేవ్ అయ్యారు.. ప్రేక్షకుల తీర్పు ఇలాగే ఉంది.. అంటూ పదే పదే ప్రేక్షకులపై భారం నెట్టేయడం వెనక ఆంతర్యమేంటో తెలీదు.. కానీ, ఈ సీన్‌కి ఇంత డ్రామా అవసరమా.? అని ఆడియన్స్ ఫీలవుతున్నారు. సాధారణంగా ఈ ప్రాసెస్ అంతా వీకెండ్స్‌లో జరుగుతుంది. అలాంటిది అర్ధరాత్రి కంటెస్టెంట్స్‌ని నిద్రలేపి, అందర్నీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోమని చెప్పడం, అందర్నీ ఎలిమినేట్ చేసి, షో అక్కడితో నిలిపివేస్తామన్నట్లుగా బిల్డప్ ఇచ్చి, చివరికి ఒకరిని మాత్రమే సేవ్ చేసి, మిగిలిన వారిలో ఎవరు సేవ్ అవుతారు.? ఎవరు హౌస్ నుండి బయటికి వెళాతారు,? వీకెండ్‌లో నాగార్జున వచ్చి చెబుతారు.? అని చెప్పడంతో ఆడియన్స్ విస్తుపోయారు. అసలు హౌస్‌లో ఏం జరుగుతుందో.? తెలియక కంటెస్టెంట్లు అయోమయంలో పడిపోయారు.