'గౌతమీ పుత్ర శాతకర్ణి' మొదలుకుని నిన్నటి 'జై సింహా' సినిమా వరకూ ఫటాఫట్ ధనాధన్ మూడు సినిమాలు చేసేశాడు బాలయ్య. వీటిలో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా ఘన విజయం సాధించగా, మిగిలిన రెండు సినిమాలూ ఫర్వాలేదనిపించాయి. ప్రస్తుతం బాలయ్య కాస్త గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఎన్టీఆర్ బయోపిక్ మాత్రమే ఉంది. ఆ సినిమా పట్టాలెక్కేందుకు ఇంకా చాలా టైమే పడుతుంది. 'ఎన్టీఆర్' సినిమాని తెరకెక్కించబోయే డైరెక్టర్ తేజ ప్రస్తుతం వెంకటేష్‌తో 'ఆటా నాదే వేటా నాదే' సినిమాతో బిజీగా ఉన్నాడు. సో ఈ సినిమా పూర్తయితే కానీ బాలయ్యతో 'ఎన్టీఆర్' చిత్రాన్ని తెరకెక్కించలేడు.
దాంతో బాలయ్య నెక్ట్స్ ఎవరితో సినిమా చేస్తాడనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ సస్పెన్స్‌లో కొంతమంది యంగ్ డైరెక్టర్స్ బాలయ్యతో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నారంటూ వార్తలు వెలుగులోకి వచ్చాయి. వారెవరో కాదు, సంపత్‌నంది, అనిల్ రావిపూడి.. ఇంకా కొందరు యంగ్ డైరెక్టర్స్ పేర్లు ఈ లిస్టులో వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరికీ బాలయ్య నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదట. ప్రస్తుతం ఎలక్షన్స్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్లో బాలయ్య మహా అయితే ఒక సినిమా చేయగలడు. అది కూడా 'ఎన్టీఆర్' బయోపిక్ అయినా అయ్యుండొచ్చు.
ఏది ఏమైనా ఎలక్షన్స్ తర్వాతే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో బాలయ్య ఉన్నాడనీ తెలుస్తోంది. కాదు కాదు రాబోయే ఎలక్షన్స్ లోపలే బాలయ్య రెండు సినిమాలను పూర్తి చేసే యోచనలో ఉన్నాడంటూ మరో పక్క ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాలయ్య ఇంతకీ ఏ దర్శకుడికి కమిట్ అయ్యాడు అనేది తెలియాలంటే తప్పదు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ టైమ్.