తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకే అవకాశాలు రావాలి అనే డిమాండ్ తేలిపోయిందిప్పుడు. అది అసలు అర్ధం పర్ధం లేని డిమాండ్ అని పలువురు సినీ ప్రముఖులు తేల్చేశారు. కానీ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు అనే ఇష్యూ బాగా హైలైట్ అయింది. అయితే అది ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన విషయం తప్ప, సినిమా రంగం మొత్తానికి దాన్ని ఆపాదించడం తగదని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని రేణుకా చౌదరి చెప్పడం, వివిధ రంగాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ అనే అంశానికి ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తోంది.
సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ అంటూ ఇష్యూని రైజ్ చేసిన శ్రీరెడ్డి విషయాన్ని హైప్ చేసిన న్యూస్ ఛానెల్స్ కూడా ఇప్పుడామెని పక్కన పెట్టేశాయి. దాంతో క్రమక్రమంగా ఈ విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. ఇక ఈ విషయంలో శ్రీరెడ్డి చేయడానికి ఏమీ లేదని తేలిపోయింది. సో ఇంత చేసిన శ్రీరెడ్డికి ఫ్రీగా పబ్లిసిటీ దక్కడం మినహా ఆమె నగ్న ప్రదర్శన ద్వారా సాధించింది ఏమీ లేదని తేలిపోయింది.
ప్రస్తుతం పూర్తిగా తాను లేవనెత్తిన ఇష్యూలో శ్రీరెడ్డి జీరో అయిపోయిందనుకోవచ్చు. సినిమా అంటేనే వ్యాపారం. తమ వ్యాపారం లాభార్జనతో సాగాలంటే, కాస్టింగ్ విషయంలో ఆయా సినిమాల ప్రొడ్యూసర్స్ ఇష్టం తప్ప, థర్డ్ పర్సన్ జోక్యం పనికిరాదని ఎవరికి వారే క్లారిటీ ఇచ్చేశారు ఇండస్ట్రీలో. సో శ్రీరెడ్డి నగ్న ప్రదర్శన, బూతు నిరసన బూడిదలో పోసిన పన్నీరే అయిపోయాయ్.