జనసేన పార్టీలోకి చిరంజీవి చేరిపోతారని, చిరుకి గౌరవ అధ్యక్షుడి పదవి కట్టబెడతారని చాలా రోజుల నుంచీ ప్రచారం జరుగుతూ ఉంది. చిరు కూడా కొంతకాలంగా తన కాంగ్రెస్ పార్టీకి అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన తెలంగాణ ఎన్నికల్లో చిరు అస్సలు కనిపించనే లేదు. కాంగ్రెస్ పార్టీకి చిరు రామ్ రామ్ చెప్పేశారన్నది మెగా కాంపౌండ్ వర్గాల మాట. అదే నిజం కూడా. అధికారికంగా కాకపోయినా, అనధికారికంగా ఆయన కాంగ్రెస్ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసినట్టే.
ఇదంతా జనసేన కోసమే అన్నది మెగా అభిమానులు నమ్ముతున్నారు. అతి త్వరలో జనసేనలో చిరు అడుగుపెట్టడం ఖాయమని, ఇద్దరు అన్నదమ్ములూ ఇప్పుడు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం హ్యూహాలు రచిస్తారని తెలుస్తోంది. సైరా షూటింగ్ లో చిరు బిజీ గా ఉన్నారు, వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌పూర్తి చేసుకుని, అప్పుడు తమ్ముడితో చేయి కలపాలని, 'గ్లాసు' (జనసేన పార్టీ గుర్తు) అందుకోవాలని చూస్తున్నార్ట.
2019 కొత్త యేడాదిలోనే చిరు తన నిర్ణయాన్ని తెలియజేస్తారని సమాచారం అందుతోంది. చిరు రాక 'జనసేన'కు మరింత బలాన్నిస్తుందని మెగా అభిమానులు నమ్ముతున్నారు. మరి అందుకు ముహూర్తం ఎప్పుడు ఫిక్సయ్యిందో...??