బెల్లకొండ శ్రీనివాస్ - కాజల్ జంటగా నటించిన `కవచం` సినిమా గుర్తున్నా - గుర్తుండకపోయినా.. ఆ సినిమా ట్రైలర్ లాంఛ్ వేడుక మాత్రం తప్పకుండా గుర్తుండిపోతుంది. ఛోటా - కాజల్ `ముద్దు` సీన్‌కి వేదిక అదే కదా! ఈ హఠాత్ పరిణామానికి కాజల్ తో పాటు యావత్ చిత్రసీమ కూడా షాక్ కి గురైంది. అలా అందరి ముందూ, మరీ ముఖ్యంగా మీడియా ముందు ఛోటా అలా ముద్దు పెట్టేశాడేంటి? అంటూ పరిశ్రమ ఆశ్చర్యపోయింది. ఛోటాని టాలీవుడ్ నుంచి నిషేధించాలన్నంత రేంజులో ట్రోలింగ్ నిర్వహించారు కాజల్ ఫ్యాన్స్.
ఈ ఘటన తరవాత.. కాజల్ ఛోటాపై సీరియస్ అయ్యిందని టాక్. వేదిక పై నవ్వుతూ ఉన్నట్టు కనిపించిన కాజల్... ఫంక్షన్ అయ్యాక మాత్రం ఛోటాకి క్లాస్ పీకిందని, ఛోటా 'సారీ' చెప్పినా కాజల్ తగ్గలేదని టాక్. అయితే.. ఈ వ్యవహారం ముదరకుండా ముదరకుండా కొంతమంది సినీ పెద్దలు రంగంలోకి దిగారని, కాజల్‌కి సర్ది చెప్పారని, ఛోటా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని, ఈ విషయాన్ని మర్చిపోవాలని కోరారని, అందుకే కాజల్ కూడా దీన్ని పెద్దది చేయలేదని తెలుస్తోంది. మొత్తానికి ఛోటా ఓ పెద్ద... వ్యవహారంలోంచే బయటపడ్డాడు. ఇకమీదైనా.. ఇలాంటి అల్లరి పనులు చేయకుండా ఆగుతాడేమో చూడాలి.