రామ్ చరణ్ ఎప్పుడూ కామ్ అండ్ కూల్ గా ఉంటాడు. స్టేజీ పై పెద్దగా మాట్లాడడు. ఆవేశం చూపించడు. గొప్పలు చెప్పుకోడు. ఈ లక్షణాలన్నీ చరణ్‌ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే... నాన్నంటే విపరీతమైన గౌరవం. ప్రేమ. అది మాత్రం తన మాటల్లో కనిపిస్తుంది.. వినిపిస్తుంది. తండ్రి జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు. అదంతా.. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో కనిపించింది.
వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ వరంగంల్ లో జరిగింది. ఈ వేడుకకు చరణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. సినిమా గురించి, అందులో వీరయ్యగా తండ్రి గురించి, దర్శకుడి గురించి మాట్లాడుతూనే.. ఒక్కసారి టాపిక్ మార్చాడు. తన తండ్రి చాలా కామ్ గా ఉంటాడని, కానీ కామ్ గా ఉండేది ఆయన మాత్రమే అని, ఆయన వెనకాల ఉన్న తాను మాత్రం క్వయిట్ గా ఉండనని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు చరణ్.
చిరంజీవి నిజంగానే క్వయిట్. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోడు. ఎవరెన్ని అన్నా పట్టించుకోడు. అందుకనే ఆయన్ని టార్గెట్ చేసేవాళ్లు ఎక్కువైపోయారు. ఈమధ్య చిరంజీవి గురించీ, ఆయన కుటుంబం గురించీ కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్లలో... రోజా ఒకరు. చిరంజీవి ఎవరికీ ఏమీ చేయలేదని ఓ సందర్భంలో రోజా ఎద్దేవా చేసింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే చరణ్ ఈ వార్నింగ్ ఇచ్చాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వీరయ్య ఈవెంట్ లో చరణ్ స్పీచే హైలెట్ అయ్యింది. అదే టాక్ ఆఫ్ ది టౌన్ ఇప్పుడు.