'డీజే టిల్లు' ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. సిద్దు జొన్నల గడ్డ.. బాడీ లాంగ్వేజ్, తన డైలాగులు, పంచ్‌లూ... ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. వాటితో పాటు లిప్ లాక్కులూ పండాయి. ఇప్పడు 'డీజే టిల్లు 2' స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకి హీరోయిన్ల బాధ వేధిస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమాకి హీరోయిన్ సెట్ కాలేదు. డీజే టిల్లు లో నటించిన నేహా శెట్టి.. పార్ట్ 2లో లేదు. ఆమె స్థానంలో కొత్త కథానాయికని తీసుకురావాలి. అందుకోసం అనుపమ పరమేశ్వరన్ పేరు పరిశీలించారు. తను కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకొంది. అయితే సడన్‌గా... అనుపమ ఈ సినిమా నుంచి తప్పుకొందని టాక్. ఆమె స్థానంలో మడోన్నా సెబాస్టియన్‌ని ఎంచుకొన్నట్టు సమాచారం. కథ చెప్పగానే, సినిమా చేయడానికి అంగీకరించిన అనుపమ... సడన్ గా ప్లేటు మార్చడం ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
ఇన్ సైడ్ టాక్ ఏమిటంటే... ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు చాలా ఉన్నాయట. వాటికి భయపడే అనుపమ 'నో' చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అనుపమకు లిప్ లాక్కులు ఏం కొత్త కాదు. ఇది వరకు `రౌడీ బోయ్స్`లో లిప్పు లాక్కులు రెచ్చిపోయి మరీ పెట్టింది. అలాంటి అనుపమ ముద్దు సీన్లకు భయపడి ఎందుకు `నో` చెబుతోందో అర్థం కావడం లేదు. రౌడీ బోయ్స్‌ని తన ఇమేజ్ కి డామేజ్ అయ్యిందని, తనపై ఉన్న క్లీన్ హీరోయిన్ ఇమేజ్ చెడిపోయిందని, అందుకే.. ఆ టైపు కథలకు అనుపమ ఒప్పుకోవడం లేదని, అందుకే `టిల్లు 2` నుంచి సైడ్ అయిపోయిందని మరో టాక్ వినిపిస్తోంది.