గతేడాది జూలైలోనే సెట్స్ మీదికెళ్లిన 'సీత' జాడ ఇంకా లేదేం. అంతకన్నా వెనక మొదలైన సినిమాలే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి క్యూ కట్టాయి. అంతెందుకు 'సీత' సినిమా సెట్స్‌పై ఉండగానే బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం' సినిమాని స్టార్ట్ చేసి పూర్తి చేసి రిలీజ్ చేసేశాడు కూడా. జనం ఆ సినిమాని మర్చిపోయారు కూడా. అలాంటిది 'సీత' విషయంలో ఎందుకింత లేట్. అంటే ఈ సినిమాకి అసలింతకీ స్క్రిప్టు కరెక్ట్‌గా సెట్ కాలేదంట అనే గాసిప్స్ వినవస్తున్నాయి.
'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన డైరెక్టర్ తేజ తర్వాత బాలయ్యతో 'ఎన్టీఆర్' బయోపిక్ టేకప్ చేయడం, మధ్యలోనే దాన్ని వదిలిపెట్టేయడం.. విమర్శల పాలు కావడం.. చకచకా జరిగిపోయాయి. విశేషమేంటంటే, ఆ తర్వాత స్టార్ట్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ కూడా రిలీజైపోయింది. మరి తేజ, 'సీత'ని పట్టుకుని ఇంకెన్నాళ్లు సానపెడతాడో ఏమో కానీ, ఈ లోగా బెల్లంకొండ ఒప్పుకున్న మరో రెండు సినిమాలు కూడా పూర్తైపోతాయేమో అనుకుంటున్నారు అభిమానులు.
అసలింతకీ తేజ, 'సీత' సినిమాని ఎందుకింత లైట్ తీసుకుంటున్నాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. మరోవైపు ఈ సినిమాతో కాజల్ విలన్ అవతారమెత్తబోతోందనే ప్రచారం కూడా జరిగింది. అదేంటో చూసేద్దామని కాజల్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. మరి ఈ అనుమానాలకు, ఉత్కంఠకు తెర పడాలంటే సినిమా నిర్మాణంలో తేజ జోరు పెంచక తప్పదు మరి.