ఎలాంటి పాత్రనైనా సునాయాసంగా నటించి రక్తి కట్టించగల టాలెంట్ ఉన్న ముద్దుగుమ్మ నిత్యామీనన్. సాధారణ హీరోయిన్ అవకాశాల కన్నా ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ క్యారెక్టర్స్‌కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఎంచుకుంటున్న పాత్రలన్నీ కూడా ఆ తరహాలోనివే. తాజాగా నాని సమర్పణలో వచ్చిన సినిమా 'అ'లో నిత్యామీనన్ 'లెస్బియన్' పాత్రలో నటించి పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. అయినా కానీ ఆ పాత్రలో నిత్యామీనన్ కాబట్టే ఆ పాత్రకి అంత అందం, విలువ దక్కాయి కూడా. ఆ టాలెంట్ చూసే ఈ ముద్దుగుమ్మకి హీరోయిన్గా పలు ఆఫర్లు వస్తున్నాయట.
కానీ పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలకు నిత్యామీనన్ సున్నితంగా నో అనేస్తోందట. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే రమ్మని చెబుతోందట. అయినా ఇప్పుడు నిత్యామీనన్ ఆలోచనలు కూడా మారిపోయాయి. నటనతో ఆకట్టుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు దర్శకత్వ విభాగం వైపు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. బేసిగ్గా ఈ బ్యూటీ మల్టీ టాలెంటెడ్. డైలాగ్స్ రాస్తుంది. పాటలు పాడుతుంది. సినిమా నిర్మాణంలో పలు సూచనలు కూడా ఇస్తూ ఉంటుందట. ఇన్ని టాలెంట్స్ ఉన్న ఈ భామకి డైరెక్షన్ పెద్ద కష్టమైన పనేం కాదని చెబుతోంది కూడా.
అందుకే త్వరలోనే మెగా ఫోన్ పడతాననీ ఈ మధ్య చాలా సందర్భాల్లో చాలా సార్లు ఓపెన్‌గా చెప్పేస్తోంది. ఈ తరుణంలో తన దృష్టి అంతా అటు వైపే ఉంటుందనీ, హీరోయిన్గా నటించి ఎక్కువ టైమ్ కేటాయించలేననీ చెబుతోందట. అందుకే ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కూడా నిత్యా హీరోయిన్ అవకాశాలు వదిలేసుకుని డిఫరెంట్ క్యారెక్టర్స్ వైపు ఎక్కువ ఆశక్తి చూపిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్.