హీరోయిన్‌గా ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ, ప్రమోషన్స్‌కి రాదు అన్న కారణంతో నయన్‌ని హేట్ చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు. అంతేకాదు, క్రేజ్‌తో పాటే, విమర్శలు కూడా చాలా ఎక్కువ నయనతారకు. అసలెందుకు నయన్‌కే అలా జరుగుతోంది.? ప్రమోషన్స్‌కి వచ్చే హీరోయిన్స్‌పై ఆడియన్స్‌కి ఆదరణ మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. బోలెడంత అనుభవం, ఇమేజ్ ఉన్న నయనతార ఎందుకీ విషయాన్ని లైట్ తీసుకుంటుంది.? అంటే అందుకు సవాలక్ష కారణాలే చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.
అందులో మొదటి కారణంగా తాను ప్రమోషన్స్‌కి వచ్చిన సినిమా పరాజయం పాలవుతుందట.. అనే ఓ సెంటిమెంట్ బయట పెట్టింది. ఆ సెంటిమెంట్‌తోనే ప్రమోషన్స్‌కి రానని నిగ్గదీసి చెప్పింది. అంతేకాదు, ప్రేమ కారణంగా కావచ్చు, ఆమె నోటి నుండి క్యాజువల్‌గా వచ్చిన మాటల్ని వక్రీకరించి చేసిన విమర్శలు కావచ్చు.. ఇలా హీరోయిన్‌గా నయన్ ఎదుర్కొన్న ఇబ్బందులు చాలా చాలా ఎక్కువట. సో ఆయా విమర్శల్ని భరించే ఓపిక లేకనే నయన్ మొత్తానికి ప్రమోషన్స్‌కి హాజరు కావడం మానేసిందట.
ఎవరేమైనా అనుకోనీ, ఎంత వారలైనా కానీ, తాను తీసుకున్న స్టాండ్‌ని బ్రేక్ చేయలేదు నయన్. ఇటీవల 'సైరా' నరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్‌కి ఎలాగైనా నయన్ వస్తుందని భావించారంతా. కానీ, అక్కడున్నది నయన్. అంతే. ఇదిలా ఉంటే, లేటెస్ట్‌గా ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై తళుక్కున మెరిసి, నయనతార ఓ కొత్త రికార్డు సృష్టించింది. వోగ్ మ్యాగజైన్‌పై మెరిసిన తొలి సౌత్ భామగా నయన్ సెన్సేషన్ సృష్టించింది. దటీజ్ 'సౌత్ క్వీన్ నయన్'.!