ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన రెండు సినిమాలు కూడా చిన్న బడ్జెట్ వి అయినప్పటికి ఆడియన్స్ వద్ద మాత్రం విడుదలకి ముందు పాజిటివ్ బజ్ మాత్రం సంపాదించుకున్నాయి.
ఇక ఈ వారం విడుదలైన చిత్రాలు- మంచు లక్ష్మి ప్రాధన పాత్ర పోషించిన W/o రామ్ ఒకటి కాగా మరొకటి రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన లవర్.
ముందుగా మంచు లక్ష్మి లవర్ గురించి మట్లాడుకుంటే- ఈ ట్రైలర్ విడుదల నుండే ఈ సినిమా ఒక థ్రిల్లర్ అని అర్ధమైపోయింది. దర్శకుడు విజయ్ కూడా ఈ సినిమాలో థ్రిల్లర్ కి కావాల్సిన అన్ని అంశాలని సమకూర్చడంలో దాదాపుగా సఫలీకృతుడయ్యాడు అని చెప్పొచ్చు.
మంచు లక్ష్మితో పాత్రకి తగట్టుగా అభినయం చేయించడంలో నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ఇక కథనం విషయంలో మొదటి సగం కాస్త నిరాశ పరిచినా రెండవ భాగంలో పుంజుకుని క్లిమక్స్ ట్విస్ట్ తో కథకి న్యాయం చేశాడు. ఇక ఇది చిన్న సినిమా కావడంతో మంచి పబ్లిసిటీ, ఆ పైన ఆడియన్స్ మౌత్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద బయటపడే ఆస్కారం ఉంది.
ఇక చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్ కి ఈ చిత్రం కాస్త వరకు ఉపశమనం కలిగించేదిగా అనిపిస్తున్నది. ఈ లవర్ విషయానికి వస్తే, లవ్ నేపధ్యంలో సాగే కథకి యాక్షన్ ఎపిసోడ్స్ ని సమత్యులంగా ఉంచే పనిలో కొంతవరకు పాస్ అయ్యాడు దర్శకుడ్ అనీష్ కృష్ణ.
రాజ్ తరుణ్, రిద్ధి కుమార్ తమ పాత్రలకి అదే సమయంలో కథకి సైతం న్యాయం చేయగా పాటలు, కెమెరా ఈ సినిమాని సాధారణ సినిమా నుండి యావరేజ్ వరకు తీసుకొచ్చాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ భవిష్యత్తు కూడా ప్రేక్షకుల పైనే ఆధారపడి ఉంది.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.