బిగ్ బాస్ లో మంచు లక్ష్మి

By iQlikMovies - July 22, 2018 - 13:56 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ షో ఇప్పుడు తెలుగు వీక్షకులకి ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకి సంబంధించి వివరాలని తమ రోజు వారి మాటలతో కలిపి మాట్లాడేసుకుంటున్నారు. దీనికి మంచి ఉదాహరణ ఆ షో కి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్.

ఇక ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించి మంచు లక్ష్మి తన సినిమా W/o రామ్ ప్రొమోషన్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటికి వెళ్ళింది. కొద్దిసేపటి క్రితం విడుదలైన ఎపిసోడ్ ప్రోమోలో మంచు లక్ష్మి మస్త్ గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

అయితే ఇంకొక విశేషమేమిటంటే- ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన సామ్రాట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటేస్టంట్ గా ఉండటం. ఇప్పుడు మంచు లక్ష్మి బిగ్ బాస్ ఇంటికి రావడంతో ఈ ఇద్దరు కలిసి తమ సినిమా ప్రొమోషన్ ఇంకా బాగా చేస్తారు అని వేరే చెప్పకర్లేదు కదా..

కొసమెరుపు ఏంటంటే- ఈ వారం ఎలిమినేషన్ లో సామ్రాట్ ఇంకా సేఫ్ జోన్ లోకి వెళ్ళలేదు. దీనితో ఈ రోజు ఎపిసోడ్ లో ఏమైనా జరగోచ్చు..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS