విమర్శలకు కీర్తి సురేష్‌ చెక్‌ పెడుతుందా?

By iQlikMovies - April 26, 2018 - 14:41 PM IST

మరిన్ని వార్తలు

కీర్తి సురేష్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోన్న సినిమా 'మహానటి'. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న తరుణంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతం చేశారు. అందులో భాగంగా సినిమా నుండి ఒక్కో పోస్టర్‌ రిలీజ్‌ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ జరగనుంది. మే 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో తలమునకలవుతోంది.

 

భారీ కాస్టింగ్‌తో, భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ డిఫరెంట్‌ హావభావాలు పలికిస్తున్న పోస్టర్స్‌ సందడి చేస్తున్నాయి. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ దగ్గర నుండీ, లీడ్‌ రోల్‌ పోషిస్తోన్న కీర్తి సురేష్‌ విమర్శలు అందుకుంటోంది. ఆ విమర్శలకు లేటెస్టుగా విడుదలవుతున్న పోస్టర్స్‌తో కీర్తి సురేష్‌ చెక్‌ పెడుతుందా? అంటే పూర్తిగా అందరూ ఏకీభవించలేకపోతున్నారు. సావిత్రి ఒక్క చూపు చూస్తే చాలు, వేల హావభావాలు ఆమె కళ్లలో పలికేస్తాయి. కళ్లే కాదు, నవ్వితే చాలు ఆ నవ్వులోనే ఆమె అందమైన పెదవులు కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ మనతో పంచుకుంటాయి. అందుకే ఆమె మహా..నటి అయ్యింది.

 

అలాంటి 'మహానటి' పాత్రను కీర్తి సురేష్‌ పోషిస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మక చిత్రం ఈ 'మహానటి'. ఇలాంటి కాన్సెప్ట్‌ని ఎంచుకోవడమే కత్తి మీద సాములాంటి చర్య. అలాంటిది కొత్త నటితో సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు తన ప్రతిభను ఎలా చాటుకున్నాడో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సి వుంది. నాగ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వైజయంతీ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాలో మోహన్‌బాబు, రాజేంద్ర ప్రసాద్‌, భానుమతి తదితర సీనియర్‌ నటీనటులతో పాటు సమంత, నాగచైతన్య, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండే తదితర ఈ తరం నటీనటులు కీలక పాత్రలు పోషించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS